Tuesday, July 23, 2024

Aishwarya Rai : పురివిప్పిన నెమ‌లి…

కేన్స్ ఉత్సవాల్లో బాలీవుడ్ భామలంతా తళుక్కున మెరుస్తున్నారు? మరి అందరి కలల రాణి ఎక్కడ? అంటూ అంతా సెర్చ్ చేస్తోన్న తరుణం. ఐశ్వర్యారాయ్ బచ్చన్ కేన్స్ రెడ్ కార్పెట్ పై తళుక్కున మెరిసింది.

- Advertisement -

ఈ సారి ఏకంగా డబుల్ ట్రీట్ ఇచ్చింది. రెండుసార్లు సార్టు రెడ్‌ కార్పెట్‌పై హోయలు పోయింది. ఒక డిజైన్ లో ఏకంగా పురి విప్పిన నెమలినే తలపించింది. పీకాక్ వాక్ చేస్తే ఎంత అందంగా ఉంటుందో? కార్పెట్ పై ఐశ్వర్య వాక్ చేసినా అంతే అందంగా ఉంటుందని ప్రూవ్ చేసింది. ఆమె అలకంరణ…డ్రెస్ డిజైన్ ప్రతీది మరోసారి ఐష్ ప్రత్యేకతను చాటింది. ఆ బ్యూటీలో ఐశ్వర్య మిరుమిటులు గొలిపింది. డ్రెస్ డిజైన్ ఆద్యంతం కనులకు షైనింగ్ తీసుకొచ్చింది.

ఏటా క్రమం తప్పకుండా ఈ వేడుకల్లో తప్పక మెరుస్తుంది. బాలీవుడ్ నుంచి ఏ హీరోయిన్ ఉన్నా లేకపోయినా ఐశ్వర్య మాత్రం తప్పకుండా కేన్స్ లో భాగమవుతుంది. ఈ ఏడాది కుమార్తె ఆరాధ్యతో వేడుకలకు హాజరైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆ ఈవెంట్ కి సంబంధించిన ఐశ్వర్య రాయ్ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. అయితే ఐశ్వర్య ఎంపిక చేసుకున్న డిజైన్ సంగతి పక్కనబెడితే ..ఆమె రూప లావణ్యంలో వచ్చిన మార్పులపై నెగిటివిటీ వ్యక్తం అవుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement