Sunday, May 19, 2024

వైరల్ గా ‘దీపిక’ డ్యాన్స్

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొణే డ్యాన్స్ వైరల్ అవుతోంది.  తాజాగా త‌న‌లోని ఇగోస్‌కు సంబంధించి ప‌లు కోణాలు చూపిస్తూ ఓ వీడియో షేర్ చేసింది. ఈ వీడియో నెటిజన్స్‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది. బాలీవుడ్ హీరో వ‌రుణ్ ధావ‌న్‌తో పాటు ప‌లువురు సెల‌బ్రిటీలు కూడా ఈ వీడియోకు స్ట‌న్నింగ్ కామెంట్స్ పెడుతున్నారు. దీపిక సినిమాల విష‌యానికి వ‌స్తే ఈ అమ్మ‌డు త‌న భ‌ర్త‌తో క‌లిసి క‌పిల్ దేవ్ బ‌యోపిక్ 83 చిత్రంలో న‌టించింది. మ‌రి కొద్ది రోజుల‌లో ఈ సినిమా విడుద‌ల కానుంది. ఇక నాగ్ అశ్విన్- ప్ర‌భాస్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్క‌నున్న చిత్రంతో తెలుగు చిత్ర సీమ‌కు ప‌రిచయం కానుంది. మ‌రో వైపు ‘దంగల్‌’ ఫేమ్‌ నితీష్‌ తివారి దర్శకత్వం వహించబోతున్న  త్రీడీ రామాయణంలో సీత‌గా దీపిక న‌టించనుంద‌నే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement