Monday, May 20, 2024

శ్రీవిష్ణు ‘భళా తందనాన’

మరో వైవిధ్యమైన సినిమాకి శ్రీకారం చుట్టారు హీరో శ్రీవిష్ణు.  చైతన్య దంతులూరి దర్శకత్వంలో శ్రీవిష్ణు హీరోగా ”భళా తందనాన” అనే సినిమా ప్రారంభమైంది. సాయి కొర్రపాటి సమర్పణలో వారాహి చలన చిత్రం బ్యానర్ పై రజిని కొర్రపాటి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ‘బాణం’ ‘బసంతి’ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న చైతన్య దంతులూరి.. మరోసారి ”భళా తందనాన” అంటూ స్వచ్ఛమైన తెలుగు టైటిల్ తో వస్తున్నాడు. టైటిల్ పోస్టర్ లో కలం మరియు కత్తిలను చూపిస్తూ అసాధారణమైన స్క్రిప్ట్ తో రాబోతున్నట్లు హింట్ ఇచ్చాడు. సూపర్ టాలెంటెడ్ టీం నుండి వస్తున్న ఈ సూపర్ స్పెషల్ ఫిల్మ్ లో శ్రీ విష్ణు ఇంతకు ముందెన్నడూ పోషించని పాత్రలో కనిపించనున్నాడు. ఇందులో  శ్రీ విష్ణు సరసన క్యాథరిన్ ట్రెసా హీరోయిన్ గా నటించనుంది. అలానే ‘కేజీఎఫ్’ సినిమాలో తన విలనీతో భయపెట్టిన రామచంద్రరాజు (గరుడ) ఈ చిత్రంలో మెయిన్ విలన్ గా కనిపించనున్నాడు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రానికి సురేష్ రగుతు సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు. శ్రీకాంత్ విస్సా రచన చేస్తున్నారు. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటర్ గా.. గాంధీ నడికుడికర్ ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేయనున్నారు. ఈరోజు ఫిబ్రవరి 16న ”భళా తందనాన” సినిమా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించబడింది. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ మార్చి నుండి ప్రారంభమవుతుందని మేకర్స్ వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement