Monday, July 22, 2024

Devara | ‘దేవర’ ఫస్ట్ సింగిల్ రిలీజ్…

కొరటాల శివ-ఎన్టీఆర్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ పాన్-ఇండియన్ మూవీ దేవర. రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ సినిమా ఫస్ట్ పార్ట్ అక్టోబర్ 10న విడుదల కానుంది. ఇదిలా ఉండగా, ఈ మూవీ నుండి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఫస్ట్ సింగిల్ “ఫియర్ సాంగ్”ని మేకర్స్ విడుదల చేశారు.

YouTube video

రేపు (మే 20) ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈ పాటతో అభిమానులకు ట్రీట్ ఇచ్చారు. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో ఈ పాటను విడుదల చేయగా.. తెలుగు వర్షెన్‌కు రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అంధించాడు. ఇక అనిరుధ్ రవిచందర్ మ్యూజికల్ గా వచ్చిన ఈ సాంగ్ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement