Wednesday, July 24, 2024

Election | గెలిస్తే సినిమాలు చేయను : కంగనా

ఎన్నికల్లో గెలిచిన తర్వాత సినిమాల నుంచి తప్పుకుంటానని బాలీవుడ్ నటి కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలు చేసింది. ‘సినిమా ఇండస్ట్రీలో నేను విజయం సాధించా. ఎన్నో అవార్డులు అందుకున్నాను. ఎంపీగా గెలిస్తే పూర్తిగా అభివృద్ధిపైనే దృష్టి సారిస్తాను. సినిమాల నుంచి తప్పుకుంటాను’ అని ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె చెప్పింది. కాగా సినిమాల నుంచి తప్పుకోవద్దని మీరొక గొప్ప నటి అని ప్రముఖ నిర్మాతలు, నటులు కోరుతున్నట్లు తెలిపింది. ప్రస్తుతం కంగనా హిమాచల్ ప్రదేశ్‌లోని మండి నియోజకవర్గం నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement