Tuesday, July 23, 2024

Iran President | ఇరాన్ అధ్యక్షుడు హెలికాప్టర్ ల్యాండ్ క్రాష్…

ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ ఆదివారం ‘హార్డ్ ల్యాండింగ్’కు గురైంది. ఈ విషయాన్ని స్థానిక మీడియా తెలిసింది. ప్రతికూల వాతావరణమే ఈ ఘటనకు కారణమని తెలుస్తున్నది. ఘటన జరిగిన ప్రదేశాన్ని గుర్తించేందుకు రెస్క్యూ బృందాలు ప్రయత్నిస్తున్నాయని ఇరాన్ ప్రభుత్వ ఆధ్వర్యంలోని ప్రెస్‌టీవీ పేర్కొంది.

అజర్‌బైజాన్‌ను సందర్శిస్తున్నప్పుడు ఈ ఘటన చోటుచేసుకుందని, హెలికాప్టర్‌లో అధ్యక్షుడితో సహా ఆయన సిబ్బంది ఉన్నట్లు తెలుస్తోంది. అయితే మూడు హెలికాప్టర్ల కాన్వాయ్‌లో రెండు గమ్యస్థానానికి సురక్షితంగా చేరుకున్నట్లు తెలుస్తోంది. ఇరాన్ రాజధాని టెహ్రాన్‌కు వాయువ్యంగా 600 కిలోమీటర్ల దూరంలో అజర్‌బైజాన్ దేశంతో సరిహద్దులో ఉన్న జోల్ఫా అనే నగరానికి సమీపంలో ఈ ఘటన జరిగిందని ప్రముఖ ఛానల్ తెలిపింది.

రెస్క్యూ టీమ్స్ హెలికాప్టర్ సైట్‌కు చేరుకోవడానికి ప్రయత్నిస్తున్నారని, అయితే ఆ ప్రాంతంలోని వాతావరణ పరిస్థితుల కారణంగా ఆటంకం ఏర్పడినట్లు సమాచారం. కొద్దిపాటి ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం పడింది. అజర్‌బైజాన్ అధ్యక్షుడు ఇల్హామ్ అలియేవ్‌తో కలిసి డ్యామ్‌ను ప్రారంభించేందుకు రైసీ ఆదివారం తెల్లవారుజామున అజర్‌బైజాన్‌లో ఉన్నారని నివేధికలు వెల్లడించాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement