భూ సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణినే సమస్యలు సృష్టిస్తోందని వైఎస్ఆర్ తెలంగాణపార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. భూ సమస్యల పరిష్కారానికి ధరణి మంత్రదండమా? అని ప్రశ్నించారు. సమస్య పరిష్కారమేమో కానీ లేని సమస్యలను సృష్టించారని మండిపడ్డారు. భూమి ఉన్నోళ్లకు లేనట్టు… లేనోళ్లకు ఉన్నట్టు చూపెడుతూ యజమానులకు లేని పంచాయితీ మోపు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భూమి కోసం అధికారుల చుట్టూ తిరగలేక లంచాలు ఇచ్చుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని షర్మిల పేర్కొన్నారు. కాస్తు కాలాన్ని ఎత్తేసి పాత పేర్ల మీద రికార్డులు చూపిస్తున్నారన్నారు. ఆ భూముల కోసం ఏకంగా హత్యలు చేసుకుంటున్నారన్నారు. లోపాలు ఉన్నాయని మీరే ఒప్పుకొన్నారు. వాటిని పరిష్కరిస్తే మీ పనికిమాలిన పని ఈ ధరణి అని తేలిపోతుందని భయపడుతున్నారా? అని షర్మిల ప్రశ్నించారు.
ధరణి లోపం తేలిపోతుందని భయమా?

Previous article
Advertisement
తాజా వార్తలు
Advertisement