Monday, May 13, 2024

పరిహారంతో పోయిన ప్రాణాలు తిరిగి వస్తాయా?: మరియమ్మ కేసుపై హైకోర్టు

తెలంగాణలో సంచలనం సృష్టించిన మరియమ్మ లాకప్‌ డెత్‌ కేసుపై తెలంగాణ హైకోర్టులో సోమవారం విచారణ జరిగింది. మరియమ్మ మృతదేహానికి గత నెలలో రీపోస్ట్‌ మార్టమ్‌ పూర్తైందని ఏజీ తెలిపారు. కుటుంబానికి రూ.15 లక్షల పరిహారం, ఉద్యోగం ఇచ్చినట్లు చెప్పారు. ఎస్‌ఐ, ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్‌ చేసినట్లు వివరించారు. ఈ నేపథ్యంలో దేశంలో ఇంకా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయా అని హైకోర్టు ప్రశ్నించింది. పోయిన ప్రాణాలు పరిహారంతో తిరిగి వస్తాయా అని ప్రశ్నించింది. ఆలేరు మేజిస్ట్రేట్‌ నివేదిక అందిన తర్వాత విచారణ జరుపుతామని తెలిపింది. నివేదిక అందిన 4 వారాల్లో కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశించింది. మరియమ్మ లాకప్‌ డెత్‌పై విచారణ సెప్టెంబర్‌ 15కి వాయిదా వేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement