Sunday, April 28, 2024

సోనూసూద్ డైహార్డ్ ఫ్యాన్స్…ఏం చేశాడో తెలుసా ?

కరోనా సమయంలో ఎంతో మంది పేద ప్రజలకు సహాయం చేసి రియల్ హీరో అనిపించుకున్నారు సోనూసూద్. ఎంతోమంది వలస కార్మికులకు స్వగ్రామాలకు తరలించి దేవుడయ్యాడు. కరోనా సెకండ్ వేవ్ సమయంలో ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేసి ప్రాణదాతగా నిలిచాడు. అయితే తను చేసిన సేవలకుగాను కొంతమంది డైహార్డ్ ఫ్యాన్స్ ఆయనకు గుడినే కట్టించేశారు. అయితే అలాంటి వారిలో ఒకడు విపుల్.

మహారాష్ట్రకు చెందిన ఈయన కాళీ ప్రదేశంలో 50 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో సోనూసూద్ చిత్రాన్ని రూపొందించారు. అయితే తయారుచేయడానికి 20 రోజుల సమయం ఆయనకు పట్టిందట. దీనికి సంబంధించిన వీడియోను ఇంస్టాగ్రామ్ లో ఆయన షేర్ చేశారు. దానిని చూసి తనకు ఎంతగానో నచ్చిందని చెప్పుకొచ్చారు. మరోవైపు సోనూసూద్ కు ఇంకో అరుదైన గౌరవం లభించింది. రష్యాలో వచ్చేఏడాది జరగబోయే స్పెషల్ ఒలంపిక్స్ వరల్డ్ వింటర్ గేమ్స్ కు భారత్ తరఫున బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపిక చేశారు. దీనిపై కూడా స్పందిస్తూ…తనకు ఎంతో గర్వంగా ఉందని చెప్పుకొచ్చారు సోనూసూద్.

Advertisement

తాజా వార్తలు

Advertisement