Monday, May 13, 2024

Priyanka Juwalkar: గులాబీ బాల‌…

టాలీవుడ్ లో తెలుగమ్మాయిల హవా గట్టిగానే పెరుగుతోంది. కొంతమంది భామలు బిగ్ సినిమాల్లో కూడా మంచి అవకాశాలు అందుకుంటున్నారు. ఒకప్పుడు ఛాన్స్ ల కోసం ఇబ్బంది పడిన బ్యూటీస్ ఇప్పుడు అందం, ఆకర్షణలో నార్త్ ఇండియన్ ముద్దుగుమ్మలతో పోటీ పడుతున్నారు. గ్లామర్ షోకి ఏ మాత్రం వెనుకాడటం లేదు. ఇండస్ట్రీలో నిలబడాలంటే కచ్చితంగా అన్ని రకాల పాత్రలు చేయడానికి సిద్ధంగా ఉండాలనే ఆలోచనకి వచ్చేశారు.

- Advertisement -

అందుకే ఇన్ స్టాగ్రామ్ లో గ్లామర్ షో చేస్తూ దర్శక, నిర్మాతలకి తామున్నామని హింట్ ఇస్తున్నారు. విజయ్ దేవరకొండ ట్యాక్సీవాలా సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన అందాల భామ ప్రియాంక జువాల్కర్. ఈ అచ్చ తెలుగు అమ్మడు మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకుంది.

రీసెంట్ గా టిల్లు స్క్వేర్ మూవీలో క్యామియో రోల్ లో మెరిసింది. ఈ బ్యూటీకి అందానికి అందం ఉంది, అలాగే నటిగా కూడా మంచి మార్కులు వేసుకుంది. సోషల్ మీడియాలో ప్రియాంక జువాల్కర్ తన కలర్ ఫుల్ గా తన గ్లామర్ షోతో కుర్రాళ్ళకి నిద్రలేని రాత్రులు మిగులుస్తుంది.

ఇదిలా ఉంటే తాజాగా ఈ తెలుగు బొమ్మ ఇన్ స్టాగ్రామ్ తో అదిరిపోయే కాస్ట్యూమ్స్ తో ఫోటోషూట్ షేర్ చేసింది. స్లీవ్ లెస్ వైట్ బ్లౌజ్ ధరించి అందాలతో కనువిందు చేస్తోంది. చక్కనైన చిరునవ్వుతో పురివిప్పిన మయూఖంలా ప్రియాంక జువాల్కర్ ఈ కాస్ట్యూమ్ లో ఉందనే మాట వినిపిస్తోంది.

ఈ ఫోటోలకి సంతోషంగా ఉన్న గులాబీ అంటూ ప్రియాంక క్యాప్షన్ ఇచ్చింది. నెటిజన్లు నుంచి ఫోటోలకి భిన్నమైన కామెంట్స్ వస్తున్నాయి. రోజు రోజుకి ప్రియాంకా అందం పెరిగిపోతుందని ఆమె అభిమానులు కామెంట్స్ చేస్తూ ఉండటం విశేషం.

Advertisement

తాజా వార్తలు

Advertisement