Friday, May 3, 2024

స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి వైసీపీ మద్దతు

విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఢిల్లీలో కార్మికులు చేపట్టిన ధర్నాకు వైఎస్ఆర్సీపీ ఎంపీలు మద్దతు ప్రకటించారు. ఢిల్లీ జంతర్‌మంతర్‌ వద్ద భారీ వర్షంలోనూ కార్మికుల నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ ధర్నాలో వైఎస్ఆర్‌సీపీ ఎంపీలు విజయసాయిరెడ్డి, ఎంవీవీ సత్యనారాయణ పాల్గొన్నారు. స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని వైఎస్సార్‌సీపీ ఎంపీలు డిమాండ్‌ చేశారు. లాభాల్లో ఉన్న స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేయడం తగదని ఎంపీ విజయసాయ రెడ్డి అన్నారు. స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. దురుద్దేశపూర్వకంగానే స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేయాలని కేంద్రం చూస్తోందని ఆరోపించారు. ప్రభుత్వ రంగ సంస్థను ప్రైవేటీకరణ చేయాల్సిన అవసరం లేదన్నారు. దశాబ్దం పాటు పోరాటం చేసి స్టీల్‌ ప్లాంట్‌ సాధించుకున్నామని, ఎన్నో త్యాగాలతో విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటు జరిగిందన్నారు. కరోనా సమయంలో ఎంతోమంది ప్రాణాలను స్టీల్‌ప్లాంట్ కాపాడిందని గుర్తు చేశారు. రూ.22 వేల కోట్ల అప్పులను ఈక్విటీగా మార్చాలని, విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు సొంతంగా గనులు కేటాయించాలి డిమాండ్ చేశారు. ఉక్కు పరిరక్షణ కోసం జరిగే ఏ పోరాటంలోనైనా వారితో కలిసి పాల్గొంటామని విజయసాయి రెడ్డి స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement