Sunday, May 12, 2024

గ్రామాన్ని అభివృద్ధి చేయాలంటూ యువ‌కుల ధ‌ర్నా

చెన్నరావుపేట : ఆ గ్రామం అన్ని స్థాయిల ప్రజాప్రతినిధులకు ఒక పుట్టినిల్లు, ఆ గ్రామంలో అన్ని రకాల వర్గాలకు పెట్టింది పేరు. ఆ గ్రామానికి మండల ప్రజాపరిషత్ అధ్యక్ష పదవి ప్రతిసారీ, ఈసారి కూడా.. అయినా ఆ గ్రామం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉందని, అభివృద్ధి పనులు మంజూరైనా.. వర్గపోరు వల్ల ముందుకు సాగటం లేదనే ప్రధాన ఆరోపణ కారణంగా ఆ గ్రామ యువకులు నర్సంపేట – నెక్కొండ ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా యువకులు మాట్లాడుతూ… గత 20 సంవత్సరాల నుండి మండలాన్ని శాసించే నాయకులంతా త‌మ జల్లి గ్రామం వారే అయినా జల్లి గ్రామం మాత్రం అభివృద్ధికి నోచుకోలేదని ఆరోపించారు. సర్పంచ్, స్థానిక ఎంపీటీసీ (ఎంపీపీ) వర్గ పోరు వల్ల కొన్ని పనులు ముందుకు సాగడం లేదని ఆరోపించారు. గ్రామంలో అభివృద్ధి విషయంలో ఎక్కడి వేసిన గొంగళి అక్కడే ఉందన్నారు. పర్యటనలు మాత్రమే కానీ, గ్రామ పరిస్థితులు మాత్రం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే స్పందించి గ్రామ సందర్శన చేసి, అభివృద్ధి పనులు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జల్లి యువకులు భూక్యా సంతోష్, ఇండ్ల సునీల్, సందీప్, వీరన్న, అనిల్, అభిలాష్, శ్రీనాథ్, రాజ్ కుమార్, నవీన్, వీరన్న, సుమన్, రాజశేఖర్, తదితరులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement