Monday, July 22, 2024

BREAKING : రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర మృతి

రోడ్డు ప్ర‌మాదంలో బుల్లితెర న‌టి మృతి చెందింది. మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని శేరిపల్లి (బి) గ్రామం వద్ద జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదం జ‌రిగింది. ఈ ప్ర‌మాదంలో టీవి యాక్ట‌ర్‌ పవిత్ర (42) దుర్మరణం చెందారు.

- Advertisement -

కర్ణాటకలోని తమ సొంత గ్రామానికి వెళ్లి తిరిగి హైదరాబాద్ వస్తుండగా తెల్లవారుజామున ఒంటిగంట ప్రాంతంలో వేగంగా వస్తున్న వారి వాహనం అదుపుతప్పి డివైడర్ ను ఢీ కొట్టి కుడివైపున హైదరాబాద్ నుంచి వనపర్తి వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీ కొట్టింది. ఈ ఘటనలో త్రినయని అనే సీరియల్‌లో మహిళ విలన్ పాత్రలో అందరినీ ఆకట్టుకుంటున్న పవిత్ర అక్కడికక్కడే మృతి చెందింది.

ఈ సంఘటనలో వారి బంధువు ఆపేక్ష, డ్రైవర్ శ్రీకాంత్, ఆమె తోటి నటుడు చంద్రకాంత్ (చందు) కు గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే భూత్పూర్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని గాయపడ్డ వారిని హుటాహుటిన జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement