Thursday, May 30, 2024

AP: బైక్‌, కారు ఢీ… ఇద్దరు చిన్నారుల మృతి

బాపట్ల జిల్లా : బైక్‌ను కారు ఢీకొట్టడంతో ఇద్దరు చిన్నారులు మృతి చెందిన ఘటన ఆదివారం ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని చినగంజాం రొంపేరు కాలువ వద్ద జరిగింది. ఈ ప్రమాదంలో అక్కాచెల్లెళ్ళు మృతిచెందగా, మరో బాలికకు తీవ్రగాయాలయ్యాయి. ఉప్పుగుండూరు నుండి బాపట్ల వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది.

ఘటనా స్థలానికి చినగంజాం పోలీసులు చేరుకున్నారు. మృతులు బాపట్ల పట్టణం 6వ వార్డుకు చెందిన దేవిసంధ్య (11), జస్విత (7)లుగా గుర్తించారు. మృతదేహాలను చీరాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement