Friday, July 26, 2024

PM Modi : పశ్చిమ బెంగాల్‌లో ప్రధాని మోడీ రోడ్‌షో

ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ పశ్చిమ బెంగాల్ ప‌ర్య‌టిస్తున్నారు. ప్రధాని మోడీ నాలుగు బహిరంగ సభల్లో ప్రసంగించనున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ పశ్చిమ బెంగాల్‌లోని బరాక్‌పూర్‌లో అకస్మాత్తుగా రోడ్ షో నిర్వహించారు.

- Advertisement -

ఈ సందర్భంగా ప్రధాని మోడీ రోడ్‌షోలో భాగంగా వీధుల్లోకి చేరుకున్నారు. ప్రజలకు ప్రధాని మోడీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని మోడీ రోడ్ షోలో పాల్గొనేందుకు రోడ్డుపై గుమికూడిన జనంలో చిన్నారులు, వృద్ధులు కూడా కనిపించారు. మహిళలతో పాటు ముందుభాగంలో ర్యాలీలో భాగస్వామ్యమవుతూ కనిపించారు. ప్రధాని మోడీ ఆకస్మిక రోడ్ షో కారణంగా ప్రజల్లో ఉత్సాహం నెలకొంది. దీని కారణంగా రోడ్ షోలో ప్రధాని మోడీ నినాదాలతో బ్యారక్‌పూర్ ప్రతిధ్వనించింది. ఎక్కడ చూసినా మోడీ, మోడీ, మోడీ అని నినాదాలు వినిపించాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement