Thursday, July 25, 2024

Kashmir: బందిపొరాలో ఉగ్రవాది అరెస్టు..

జాయింట్ ఆపరేషన్‌లో భారత సైన్యం, జమ్మూ కాశ్మీర్ పోలీసులు ఆదివారం ఉత్తర కాశ్మీర్‌లోని బందిపొరా జిల్లాలో ఒక ఉగ్రవాద సహచరుడిని అరెస్టు చేశారు. భారీగా ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు.

- Advertisement -

పోలీసు అధికారి తెలిపిన వివరాల ప్రకారం.. ఉగ్రవాదుల ఉనికి గురించి ఇంటెలిజెన్స్ ఏజెన్సీ నుండి వచ్చిన నిర్దిష్ట సమాచారం ఆధారంగా ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టిన తర్వాత పెత్‌కూట్ అడవిలో సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించబడింది. నాలుగు పిస్టల్స్, ఒక హ్యాండ్ గ్రెనేడ్, ఇతర మండుగుండు సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విజయవంతమైన ఆపరేషన్ ఫలితంగా భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నామని.. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement