Sunday, April 28, 2024

వాళ్లవి నాలుకలా? తాటి మట్టలా?: బీజేపీపై మంత్రి ఎర్రబెల్లి ఫైర్

దేశంలో ఇప్పటి వరకు ఏ రాష్ట్రం చేయనన్ని సంక్షేమ పథకాలను కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తున్నది అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండల కేంద్రంలోని ఎమ్మెల్యే అరూరి రమేష్ తో కలిసి వివిధ గ్రామాలకు చెందిన 145 మంది లబ్దిదారులకు కళ్యాణ లక్ష్మి, షాది ముభారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. కెసిఆర్ పేదింటి యువతులకు మేన మామ లా మారారని అన్నారు. పేదింటి అమ్మాయిలకు పెండ్లి కోసం 1,00116/- రూపాయల ఇస్తున్న మహానుభావుడు కేసీఆర్ అని కొనియాడారు. బిజెపి, కాంగ్రెస్ పాలించే రాష్ట్రాల్లో మన రాష్ట్రం తరహా, ఇలాంటి పథకాలు ఎక్కడా లేవన్నారు. కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను తమ తమ రాష్ట్రాల్లో అమలు పరచాలని ఆయా రాష్ట్రాల చూస్తున్నారని తెలిపారు.

ఒకవైపు కేంద్ర మంత్రులు, అధికారులు రాష్ట్రాన్ని అభినందిస్తున్నారన్న మంత్రి ఎర్రబెల్లి.. మరోవైపు రాష్ట్ర బీజేపీ నేతలు రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారని మండిపడ్డారు. ఇదెక్కడి న్యాయం? ఇదేం విధానం? వాళ్ళవి నాలుకలా? తాటి మట్టలా? అని వ్యాఖ్యానించారు. వరి ధాన్యం కొనుగోలు చేయబోమని కేంద్రం తేల్చి చెప్పిందని, బియ్యం కొనుగోలుకు కూడా కోతలు పెట్టిందని ధ్వజమెత్తారు. అయినా సీఎం కెసీఆర్ కారుకు 30 వేల కోట్లతో ధాన్యం కొనుగోలు చేసి రైతాంగాన్ని ఆదుకున్నారని చెప్పారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్ రైతాంగాన్ని ఆదుకోలేదని, పైగా రైతు వ్యతిరేక చట్టాలను తెచ్చారన్నారు. వ్యతిరేకించిన రైతులను గుర్రాలతో తొక్కించి, తూటాలు పేల్చారని ఆరోపించారు. వరి వేయిద్దు, ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని కేంద్రం చెప్పిందన్నారు. అయినా, బిజెపి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సిగ్గు లేకుండా వరి వేయమని రైతులను ప్రేరేపిస్తున్నరని అన్నారు. వీళ్లంతా ఎక్కడికి వెళ్ళారు? అలాంటి వాళ్ళను నిలదీయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

సీఎం కెసీఆర్ అపర భగీరథ ప్రయత్నంతో కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా అందరికీ సాగు నీరు అందిస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి ఇంకా దళిత బంధు ఇస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతం కోసం మన ఊరు మన బడి కార్యక్రమంతో కృషి చేస్తున్నారని మంత్రి ఎర్రబెల్లి వివరించారు. గతంలో ఎన్నో కష్టాలు పడి ఇబ్బందులు పడ్డారు. కానీ ఇప్పుడు గ్రామాల్లో కూడా ఎలాంటి ఇబ్బందులూ లేకుండా చూస్తున్నామని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement