Friday, May 24, 2024

యువ‌త‌కు ఆద‌ర్శం స్వామి వివేకానంద : మంత్రి ఎర్రబెల్లి

పర్వతగిరి : ఆధ్యాత్మిక గురువు, భారత దేశ ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన స్వామి వివేకానంద జయంతి సందర్భంగా రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గురువారం పర్వతగిరి రామకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో లయోలా హైస్కూల్ లో విద్యార్థులతో కలిసి స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. అనంతరం విద్యార్థులకు బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చింతపట్ల మాలతీ సోమేశ్వర్ రావు, స్కూల్ యాజమాన్యం మరియు రామకృష్ణ సేవాసమితి నిర్వాహకులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement