Friday, April 26, 2024

Road Accident : రేగొండలో ఘోర రోడ్డు ప్రమాదం.. ప‌లువురికి గాయాలు..

భూపాలపల్లి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం చెన్నపూర్ గ్రామ శివారులో భూపాలపల్లి – పరకాల ప్రధాన రహదారిపై గురువారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పరకాల వైపు వెళ్తున్న ఆటోను వేగంగా వచ్చిన కారు ఢీకొట్టడంతో ఆటోలో ఉన్న పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. అందులో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తిగా తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement