Wednesday, April 24, 2024

ధ‌మాకా నుండి.. దండ‌క‌డియాల్ లిరిక‌ల్ సాంగ్

మాస్ మ‌హ‌రాజ్ ర‌వితేజ న‌టించిన ధమాకా చిత్రం నుండి మాస్ లిరిక‌ల్ సాంగ్ ని రిలీజ్ చేశారు మేక‌ర్స్. దండకడియాల్ దస్తీ రుమాల్ మస్తుగున్నోడంటివే పిల్లో’ అంటూ ఈ పాట సాగుతోంది. జానపద బాణీలో జోరుగా నడిచే ఈ పాటను భీమ్స్ కంపోజ్ చేశారు. ఆయనతో కలిసి సాహితి చాగంటి .. మంగ్లీ ఈ పాటను ఆలపించారు. జానీ మాస్టర్ నృత్య దర్శకత్వంలో జోరుగా మొదలైన ఈ పాట, కొంతదూరం వెళ్లిన తరువాత ఊపు తగ్గిందేమో అనిపిస్తుంది. ఈ నెల 23వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. విశ్వప్రసాద్ – వివేక్ కూచిభొట్ల నిర్మించిన ఈ సినిమాకి, నక్కిన త్రినాథరావు దర్శకత్వం వహించారు. ఈ సినిమా నుంచి లిరికల్ సాంగ్ ని రిలీజ్ చేశారు. రవితేజ – శ్రీలీలపై ఈ హుషారైన పాటను చిత్రీకరించారు. ప్రత్యేకంగా వేసిన సెట్ లో కలర్ ఫుల్ గా ఈ పాటను పిక్చరైజ్ చేశారు.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement