Monday, May 6, 2024

రైతు వేదికలు..గోదాములకేనా..

.
వ్యవసాయంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా రైతులను మలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది … ఇందుకుగాను ఐదు వేల ఎకరాలకు ఒక క్లస్టర్ చొప్పున రైతు వేదికలను ప్రభుత్వం నిర్మించింది. వారం కోమారుగా క్లస్టర్ వేదికలో వ్యవసాయ విధివిధానాలపై రైతుల శిక్షణ అవగాహన కార్యక్రమాల సమావేశం ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇట్టి సమావేశాల కోసం ప్రభుత్వం రైతు వేదికలు ఏర్పాటు చేసినప్పటికీ ఆ లక్ష్యం నీరుగార్చేలా గోదాములుగా ఆదిలోనే మార్చింది. లక్షలు ఖర్చు చేసిన రైతు వేదికలు ఇలాంటి సమావేశాలు నిర్వహించకుండానే అట్టి లక్ష్యం నీరుగార్చేలా వరి ధాన్యం బస్తాలను రైతు వేదికల్లో వేసి ఎలుకలకు ..పందికొక్కు లకు వేదికగా మార్చింది. అనుకున్న లక్ష్యం నెరవేరక పోయినా నేటికి వానాకాలం వడ్లు కొనుగోలు చేసే సమయం ఆసన్నమైనప్పటికి, కొనుగోలు చేసిన మిల్లర్లు ధాన్యం తరలించడంలో నిర్లక్ష్యమే చేస్తున్నారు.

ప్రస్తుతం ఈ సీజన్ లో కొనుగోలు చేస్తే వచ్చే ధాన్యం మళ్లీ ఇదే పద్దతిలో రైతు వేదికలు స్టోరేజ్ చేస్తారా, రైతు వేదికలు ధాన్యం నిల్వల కోసమే ఏర్పాటు చేశారా.. .లేదా రైతుల సమస్యల కోసమే వేదికలు చేశారా అంటూ రైతులు మండిప‌డుతున్నారు. లక్షల్లో ఖర్చు చేసి నిర్మించిన రైతు వేదికలు కళ్లముందే ఎలుకలు ..పందికొక్కులకు వేదికగా మార్చడం పై క్లస్టర్ పరిధి గ్రామాల రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా పూర్తిస్థాయిలో ధాన్యం సేకరణ చేయాలని, రైతు వేదికలు రైతు సమస్యల కోసం సమావేశాల కోసం, వేదికగానే మిగిలిపోవాలి తప్ప మరోసారి ధాన్యం నిల్వలకు వాడుకోవద్దని మండల కస్టర్ పరిధి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు…

Advertisement

తాజా వార్తలు

Advertisement