Wednesday, May 15, 2024

ఢిల్లీ కూచిపూడి నృత్య ప్రదర్శనలో.. కొత్తకోట ఆణిముత్యాలు..

భారత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం 90వ జయంతి సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీలో ఉత్సవాలు నిర్వహించారు. ఈ ఉత్సవాలలో భాగంగా ఉజ్వల సామాజిక సేవా సమితి ఆధ్వర్యంలో సలాం టు కలం నృత్యప్రదర్శనలో తెలంగాణ రాష్ట్ర వనపర్తి జిల్లా కొత్తకోట పట్టణానికి చెందిన సాత్విక కూచిపూడి డాన్స్ అకాడమీ సుధారాణి విద్యార్థినిలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అందరినీ ఆకట్టుకునే విధంగా కూచిపూడి నృత్యాన్ని ప్రదర్శించి పలువురి ప్రశంసలు పొంది అవార్డులు అందుకున్నారు. అనంతరం ఈ కార్యక్రమంలో సాత్విక కూచిపూడి డాన్స్ అకాడమీ సుధారాణి, నృత్యాన్ని ప్రదర్శించిన శ్రీజని , జ్ఞానవర్దిని, శ్రీనిధి , భార్గవి కోవెలవళ్లి లను ఘనంగా సన్మానించి అభినందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement