Sunday, April 28, 2024

ఏపీలో టీఆర్ఎస్ పార్టీ పెడితే తప్పేంటి?

ఏపీలో పార్టీ పెడతానన్న తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై ఏపీ మంత్రి పేర్ని నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో టీఆర్ఎస్ పార్టీ పెడితే తప్పేంటి? అని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ పార్టీ పెట్టాలని తాము కూడా కోరుకుంటున్నామని చెప్పారు. రెండు రాష్ట్రాల్లో పార్టీ ఎందుకు.. రెండు తెలుగు రాష్ట్రాలను కలిపేస్తే పోలా అని చమత్కరించారు.  ఏపీలో పార్టీ పెట్టడానికంటే ముందు కేసీఆర్‌ తెలంగాణ కేబినెట్లో రెండు రాష్ట్రాలను కలిపేయాలనే తీర్మానాన్నిపెడితే బాగుంటుందని చెప్పారు. రెండు రాష్ట్రాలు కలిసిపోతే ఆయన భేషుగ్గా పోటీ చేయొచ్చు అని పేర్కొన్నారు. ఏపీ, తెలంగాణలు ఒకటే రాష్ట్రంగా ఉండాలని జగన్ గతంలోనే కోరుకున్నారని మంత్రి పేర్ని నాని గుర్తు చేశారు.

ఇది కూడా చదవండి: మంత్రులు, కలెక్టర్ల వీపులు పలుగుతాయి: జగ్గారెడ్డి వార్నింగ్

Advertisement

తాజా వార్తలు

Advertisement