Wednesday, May 15, 2024

పెండింగ్ లో స‌మ‌స్య‌లు..ప‌రిష్క‌రించాల‌ని డిమాండ్..

దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీ, వికలాంగులకు చెందిన విద్యార్థిని, విద్యార్థుల స్కాలర్షిప్ లు, ఫీజు రీయింబర్స్మెంట్స్ ను వెంటనే విడుదల చేయాలని డి బి ఎస్ ఎఫ్ జిల్లా అధ్యక్షుడు పోలెపాక వెంకన్న ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మ‌హ‌బూబాబాద్ జిల్లా కేంద్రంలో శ్రీపాల్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో వెంకన్న మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు అప్లై చేసుకున్న ప్రతి విద్యార్థికి స్కాలర్ షిప్ ల‌ను మంజూరు చేస్తామని చెప్పార‌న్నారు. కానీ ఆ న‌గ‌దును ఇతర పథకాల కోసం ఉపయోగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రభుత్వం స్కాలర్ షిప్ డబ్బులు ఇవ్వక పోవడంతో.. ప్రైవేట్ కళాశాల యాజమాన్యాలు ..విద్యార్థుల నుండి బలవంతంగా ఫీజులు వసూలు చేస్తున్నారన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ విద్యను పేద విద్యార్థులకు దూరం చేయడం కోసమే స్కాలర్ షిప్ లు , ఫీజు రియెంబర్మెంట్స్ ని విడుదల చేయడం లేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం పెండింగ్ లో ఉన్న స్కాలర్ షిప్ లు , ఫీజు రీయింబర్స్మెంట్ ను వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ప్రశాంత్, నేతాజీ, గణేష్, యాకన్న తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement