Friday, May 3, 2024

Drug case: షారుఖ్ కొడుకు ఆర్యన్ ఖాన్ కు బెయిల్

డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ కు బాంబే హైకోర్టులో పెద్ద ఊరట లభించింది. డ్రగ్స్ కేసులో అరెస్టైన ఆర్యన్ ఖాన్ కు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. డ్రగ్స్ కేసులో భాగంగా అక్టోబర్ 3 నుంచి ఆర్యన్ ను పోలీసులు కస్టడీలో ఉన్నాడు.

కాగా,23 ఏళ్ల ఆర్యన్ ఖాన్ ప్రస్తుతం ముంబైలోని ఆర్థర్ రోడ్ జైల్లో వున్నాడు. తన కుమారుడికి బెయిల్ తెప్పించుకునేందుకు షారుఖ్ విశ్వప్రయత్నం చేశారు. కింది కోర్టు వరుసగా బెయిల్ పిటిషన్లను తిరస్కరిస్తుండటంతో వీరు హైకోర్టును ఆశ్రయించారు. బెయిల్ పిటిషన్ పై విచారణ సందర్భంగా ఆర్యన్ కు డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉందని ఎన్సీబీ తరపు లాయర్లు వాదించారు. అయినప్పటికీ ఆర్యన్ కు బాంబే హైకోర్టు షరతులతో కూడిన బెయిలును మంజూరు చేసింది. దీంతో దాదాపు మూడు వారాల తర్వాత ఆయన విడుదల అవుతున్నాడు.

ఇది కూడా చదవండి: ఏపీలో టీఆర్ఎస్ పార్టీ పెడితే తప్పేంటి?

Advertisement

తాజా వార్తలు

Advertisement