Wednesday, May 15, 2024

మాట తప్పిన ప్రధాని మోడీ : ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి

భూపాలపల్లి : జన్ ధన్ ఖాతాలను తెరచి నల్లధనం తీసుకొచ్చి ఖాతాల్లో 15 లక్షలు వేస్తానన్న ప్ర‌ధాని మోడీ రూపాయి కూడా వేయ‌కుండా మాట త‌ప్పార‌ని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి ఆరోపించారు. శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… మోడీ మాటల ప్రధాని తప్ప పేదల ప్రధాని కాదన్నారు. కేంద్ర ప్రభుత్వం నల్ల చట్టాలు తీసుకువస్తూ ఎరువుల ధరలు పెంచుతూ దానిక నుగుణంగా ఎం ఎస్ పి పెంచకుండా రైతుల పాలిట కక్షపూరిత పాలన కొనసాగిస్తుందని రైతులకు ముఖ్యమైన పండుగ సంక్రాంతి అని, రైతులు సంతోషంగా ఉండడానికి కేసీఆర్ రైతుబంధు, రైతు బీమా ఉచిత విద్యుత్తు లాంటి ఎన్నో పథకాలకు రూపకల్పన చేసి అమలు చేయడం జరుగుతుందన్నారు. మోడీ 2018లో రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తానని మాట ఇవ్వడంతో రెండోసారి అధికారం కట్టబెట్టినప్పటికీ ఆదాయం రెట్టింపు కాకపోగా రైతుల నడ్డి విరిచే విధంగా మోడీ పాలన సాగిస్తున్నారన్నారు. మోడీ మాటలు నీటి మీద మూటలు అయ్యాయన్నారు. ఎరువుల ధరలు తగ్గించాలని కేసీఆర్ లేఖ రాస్తే బీజేపీ నాయకులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, కేసీఆర్ ను ఒక మాట అనే ముందు ఆలోచించాలన్నారు.


యూపీలో ఇప్పటికే ముగ్గురు మంత్రులు, 10 మంది ఎమ్మెల్యేలు పార్టీని వీడారని.. సమయం వస్తే బీజేపీలో ఎవరూ మిగ‌ల‌న్నారు. కేసీఆర్ ను ఇరికించేందుకు రంధ్రాన్వేషణ చేస్తున్నారని, కేసీఆర్ ను ముట్టుకొని చూడండి.. తెలంగాణ అని కాదు యావత్ దేశం భగ్గుమంటుందన్నారు. హైదరాబాద్ ఎన్నికల్లో బీజేపీకి పరాభవం తప్పదని ప్రతిపక్ష పార్టీలను భయపెడితే ఎవరు భయపడరన్నారు. రైతులపై కార్లతో తొక్కిన వారిని పక్కన పెట్టుకుంటున్నారని, రైతులకు వ్యతిరేకంగా మోడీ పరిపాలన చేస్తున్న తరుణంలో రైతుల కష్టాలు తెలిసిన కేసీఆర్ ఎరువుల ధరలు, డీజిల్ ధరలు తగ్గించాలని, పంటలకు ధర పెంచాలని కోరితే ఎదురు దాడి చేయడం సరైంది కాదన్నారు. నేటికీ కాలేశ్వరం ప్రాజెక్ట్ కి జాతీయ హోదా ప్రకటించ లేదన్నారు. ఇప్పటికైనా పార్లమెంటులో డిబేట్ చేసి రైతులకు మేలు చేయాలన్నారు. అలాగే దుర్మార్గమైన ప్రచారాన్ని పక్కన పెట్టాలని కేంద్ర ప్రభుత్వంతో పాటు బీజేపీ నాయకులను కోరారు.


ప్రతి ఒక్కరూ సెకండ్ బూస్టర్ డోస్ వేసుకోవాలి :
వైద్యులు, వైద్య సిబ్బంది బాగా పని చేయడం వల్ల ఆరో స్థానంలో ఉన్నామని, ప్రతి ఒక్కరూ సెకండ్ బూస్టర్ డోస్ తప్పనిసరిగా తీసుకోవాలని, వ్యాక్సిన్ రక్షణగా ఉంటుందని జిల్లాలో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా దానికి జిల్లా యంత్రాంగంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్ పర్సన్ వెంకట రాణి సిద్ధూ, వైస్ చైర్మన్ హరిబాబు, పట్టణ అధ్యక్షులు కటకం జనార్ధన్, మాజీ చైర్పర్సన్ రవి నాయకులు సాంబమూర్తి, గుంజాల రవీందర్, రాజ బాబు, నారాయణ, కుమార్ రెడ్డి, తిరుపతి, కొక్కుల తిరుపతి., సమ్మిరెడ్డి, రాజు, చిరంజీవి, అశోక్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement