Thursday, May 2, 2024

హీరో చిత్రం బాగుంది – గ‌ల్లా అశోక్ న‌ట‌న అద్భుతం – మ‌హేశ్ బాబు

సంక్రాంతి కానుక‌గా హీరో చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో గ‌ల్లా అశోక్, నిధి అగ‌ర్వాల్ న‌టించారు. కాగా, ఈ సినిమాలో జగపతి బాబు, నరేశ్‌, వెన్నెల కిశోర్, బ్రహ్మాజీ, త‌దిత‌రులు నటించారు. ఈ సినిమాకి శ్రీ రామ్ ఆదిత్య దర్శకత్వం వహించారు. పద్మావతి గల్లా ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాకు ఘిబ్రాన్ సంగీతం అందించారు. యాక్ష‌న్ , రొమాంటిక్ ఎంట‌ర్ టైన‌ర్ గా ఈ చిత్రం తెర‌కెక్కింది. కాగా ఈ చిత్రాన్ని సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు చూసి ప్ర‌శంస‌ల జ‌ల్లుని కురిపించాడు. అంతేకాదు ఆ చిత్ర బృందానికి ఆల్ ది బెస్ట్ చెప్పాడు. ‘ఈ సినిమా చూశాను.. నాకు విప‌రీతంగా న‌చ్చింది. ఈ సినీ బృందానికి నా శుభాకాంక్ష‌లు’ అని వ్యాఖ్యానించాడు.ముఖ్యంగా అశోక్ చాలా బాగా న‌టించాడు.. చాలా క‌ష్ట‌ప‌డ్డాడు. అత‌డిని చూసి గ‌ర్విస్తున్నాను.

నేను ఎల్ల‌ప్పుడూ న‌మ్ముతాను మ‌నం హార్డ్ వ‌ర్క్ చేస్తే విజ‌యం సాధిస్తాం. ఈ సినిమాకు ప‌నిచేసిన టెక్నీషియ‌న్లంద‌రికీ శుభాకాంక్ష‌లు. సంక్రాంతి పండుగ నాన్న‌కు క‌లిసి వ‌చ్చిన రోజు. నాకు కూడా బాగా క‌లిసివ‌చ్చింది’ అని మ‌హేశ్ బాబు తెలిపాడు. ఒక్క‌డు, సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు.. వంటి సినిమాలు సంక్రాంతికి వ‌చ్చి సూప‌ర్ హిట్ అయ్యాయి. ఇప్పుడు అశోక్‌ గ‌ల్లా సినిమా కూడా సంక్రాంతికే వ‌స్తోంది. నాన్న గారి అభిమానులు, నా అభిమానులు అశోక్ గ‌ల్లానూ అభిమానిస్తార‌ని ఆశిస్తున్నాను. ఈ సినిమా పెద్ద హిట్ కావాల‌ని కోరుకుంటున్నాను’ అని మ‌హేశ్ బాబు చెప్పాడు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement