Friday, May 24, 2024

సీఎం కేసీఆర్ నాయ‌క‌త్వంలో పండుగ‌ల‌కు పూర్వ వైభ‌వం : మంత్రి ఎర్ర‌బెల్లి

బొడ్రాయి పండగ మన వెనుకటి సంప్రదాయమని, ఇలాంటి సంప్రదాయాలకు తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసిఆర్ నాయకత్వంలో మళ్ళీ పూర్వ వైభవం వస్తుందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం పరిధి కొడకండ్ల మండలంలోని మొండ్రాయి గ్రామంలో ఘనంగా బొడ్రాయి పునఃప్రతిష్ఠ కార్యక్రమం జరిగింది. గ్రామస్తులంతా ఐక్యంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి మంత్రి ఎర్రబెల్లి హాజరై అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. రాజకీయాలకు అతీతంగా బొడ్రాయి పండుగలో పాల్గొనడం సంతోషంగా ఉన్నదన్నారు. మొండ్రాయి గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ది చేస్తానని, గతంలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చానన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement