Monday, May 13, 2024

మదినిండా మువ్వన్నెల జెండా.. సామూహిక జాతీయ గీతాలాపన..

జనగామ : దేశభక్తి ఉట్టిపడింది.. జాతీయభావం తొణికిసలాడింది.. మది నిండా మువ్వన్నెల జెండా మురిసింది..75 ఏళ్ల స్వాతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా ఈరోజు జనగామ జిల్లా కేంద్రంలోని చౌరస్తా వద్ద ఉదయం 11.30 గంటలకు ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, యువతీ యువకులు అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, అధికారులు, సిబ్బంది సామూహిక గీతాలాపన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్బంగా జిల్లా కేంద్రంతో పాటు అన్ని మండలాల్లోని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ రంగ సంస్థలు, బ్యాంకులు, ప్రైవేటు సంస్థలు, ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు, యూనివర్సిటీలు, వ్యాపార, వాణిజ్య సముదాయాలు, తదితర షాపుల యజమానులు ఎక్కడి వారు అక్కడే సామూహిక జాతీయ గీతాన్ని ఆలపించి దేశభక్తిని చాటారు. దీంతో మదినిండా జాతీయ సమైక్యతను నింపుకొని…జై జై మాత…భారత మాత.. జై జవాన్…జై కిసాన్.. అంటూ నినాదాలతో మరోమారు పట్టణం మారుమోగింది.. ఈ కార్యక్రమంలో జనగామ జిల్లా కలెక్టర్ శివ లింగయ్య, జడ్పీ చైర్మన్ సంపత్ రెడ్డి, డీసీపీ సీతారాం, అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్, జెడ్పీ సీఈవో విజయలక్ష్మి, డీఆర్డివో రాంరెడ్డి, ఆర్డీవో మధుమోహన్, ఏసీపీ క్రిష్ణ, మున్సిపల్ చైర్ పర్సన్ పోకల జమున, సీఐ శ్రీనివాస్ యాదవ్, జిల్లా అధికారులు, ప్రజా ప్రతి నిధులు, యువత, మహిళలు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement