Sunday, June 2, 2024

TS : మైలారంలో ఓట్లను బహిష్కరించిన గ్రామస్తులు

అచ్చంపేటరూరల్, మే 13 (ప్రభ న్యూస్): మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లా మైలారం గ్రామంలో ఓట్లను గ్రామస్తులు బహిష్కరించారు. దీంతో ఓటర్లు లేక పోలింగ్ బూత్ పోసిపోయింది.

మైనింగ్ అధికారులు లిజ్ పేరుతో త్రవ్వుటకు ఏర్పాటు చేయడాన్ని నిరసిస్తూ గుట్ట తవ్వకాన్ని ఆపాలని గ్రామస్తులు ముక్తకంఠంతో అధికారులకు విన్న‌వించుకున్న ప‌ట్టించుకోక‌పోవ‌డం లేదంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. మైలారంలో గుట్ట త్రవ్వకాలను నిలుపుదల చేస్తున్నట్లు రాతపూర్వకంగా రాసియ్యాలని ఆర్డిఓ మాధవిని కోరారు.

- Advertisement -

అలా చేయని యెడల ఓట్లు బహిష్కరిస్తామని వారు ఘంటాపథంగా చెప్పారు. ఆర్డీవో మాధవి గ్రామ ప్రజలతో మాట్లాడుతూ మాట్లాడుతూ ఓటు అనేది ఓటరు యొక్క వజ్రాయుధమని దాని ఉపయోగించుకోకపోవడం నష్టానికి దారితీస్తుందని చెప్పినప్పటికీ గ్రామస్తులు ససేమిరా అన్నారు. ఇప్పటికైనా మైలారం గుట్ట త్రవ్వకాలను ఆపుతామని ఆర్డిఓ అధికారికంగా లెటర్ ఇస్తే ఎన్నికలు సజావుగా పాల్గొంటామని గ్రామస్తులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement