Tuesday, May 14, 2024

భార్యపై కత్తితో దాడి..

 ములుగు : జిల్లాలోని వెంకటాపురం మండలం ఆలుబాకా గ్రామంలో భార్య కాకా సంధ్యపై భర్త కత్తితో దాడి చేశాడు. అనుమానంతో భార్యపై విచక్షణ రహితంగా దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో సంధ్యకు పది చోట్ల కత్తి గాయాలు అయ్యాయి. వెంటనే బాధితురాలిని హుటాహుటిన వెంకటాపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. విషయం తెలిసిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement