Wednesday, May 15, 2024

ష‌ర్మిల‌తో అజారుద్దీన్ కుమారుడు, సానియా మీర్జా సోద‌రి బేటి..

హైద‌రాబాద్ – తెలంగాణ‌లో కొత్త పార్టీ ఏర్పాట్ల‌లో నిమ‌గ్న‌మైన వైఎస్ ష‌ర్మిల‌ను భార‌త క్రికెట్ మాజీ కెప్టెన్ మ‌హ్మ‌ద్ అజారుద్దీన్ కుమారుడు అస‌ద్, టెన్నీస్ స్టార్ సానియా మీర్జా సోద‌రి ఆనం మీర్జాలు నేడు లోట‌స్ పాండ్ లో బేటి అయ్యారు.. నేటి ఉద‌యం అస‌ద్,ఆనం మీర్జా దంప‌తులు ష‌ర్మిల‌తో గంట‌పాటు చ‌ర్చ‌లు జ‌రిపారు.. అయితే చ‌ర్చ‌లు సారాంశం తెలీయ‌రాలేదు..ఈ ఇద్దరు వైఎస్ షర్మిల పార్టీలో చేరబోతున్నారని ప్రచారం జరుగుతోంది. అయితే, మర్యాదపూర్వకంగానే వైఎస్ షర్మిలను కలిసినట్టు మహ్మద్ అసుదుద్దీన్, ఆనం మీర్జాలు మీడియాకు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement