Saturday, April 27, 2024

ఉద్య‌మ నాయ‌కుల‌కు ప్రాధాన్య‌త ఇవ్వండి

వరంగ‌ల్ – గ్రేటర్ వరంగల్ నగరపాలక సంస్థ ఎన్నికల్లోతెరాస పార్టీ విజయాన్ని స్వాగతిస్తున్నామని బీసీ దళిత మైనార్టీల మహాదండు కన్వీనర్ దాసు సురేశ్ మీడియాకు తెలియజేసారు.తెరాసను ఉద్యమ పార్టీగా భావించి తెలంగాణ ప్రజలు అందించిన అపూర్వ విజయమన్నారు..
కానీ ఈ మధ్యన జరిగిన మున్సిపల్ ఎన్నికల తదనంతరం పార్టీలో జరుగుతున్న పరిణామాల దృష్ట్యా తెరాస పార్టీ తెలంగాణ వాదులకు, ఉద్యమ కాలం నుండి కొనసాగుతున్న కార్యకర్తలకు దూరంగా జరుగుతున్నదనే భావన ప్రజల్లో నెలకొందని ఓరుగల్లు మహా దండు కన్వీనర్ దాసు సురేష్ ఆరోపించారు.
కాబట్టి ఇకనైనా సంకుచిత దృష్టిని విడనాడి ఉద్యమ కాలం నుండి మీపై నమ్మకంతో సేవలందిస్తూ సరైన అవకాశాలు రాని కార్పొరేటర్లలో ఒకరిని మేయర్ గా అవకాశాన్ని కల్పించండి అని డిమాండ్ చేశారు .మిగిలిన ఉద్యమకారులకు డైరెక్టర్ లుగా , చైర్మన్లుగా వివిధ కార్పొరేషన్లలో అవకాశాలు ఇవ్వాలన్నారు . మరోవైపు ప్రజలకు ఇచ్చిన కాకతీయ టెక్స్టైల్ పార్క్ వంటి హామీలను సత్వరం నెరవేర్చి తెలంగాణ ప్రజల అభిమానాన్ని చురగొణాలని డిమాండ్ చేశారు.
ఈ సమావేశంలో పార్టీ ఆవిర్భావం నుండి 20 సం”లు అంకిత భావంతో సేవలందించిన, 19 డివిజన్ తిరుగుబాటు అభ్యర్థి నూకల రాణి మాట్లాడుతూ తన లాంటి నిజమైన కార్యకర్తలను గుర్తించి అవకాశాలు కల్పించడంలో పార్టీ విఫలమైందని ఆరోపించారు. జాతీయ, రాష్ట్ర స్థాయిలో రాజ్యసభ ఎంపీగా,మహిళా చైర్మన్ గా వివిధ పదవులను అలంకరించిన గుండు సుధారాణి లాంటి నాయకురాలిని కార్పోరేటర్ స్థాయికి దిగజార్చడం తగదన్నారు. తద్వారా త‌మ‌లాంటి వారి అవకాశాలు మృగ్యమవడం శోచనీయమన్నారు.
కాబట్టి ఇకనైనా ఉద్యమ పార్టీగా ఉద్యమ కాలం నాటి నుండి కొనసాగుతున్న కార్పొరేటర్లయిన గుండేటి నరేందర్, నల్ల స్వరూప ,రిజ్వానా మసూద్ ఇలాంటి వారిలో ఒకరికి మేయర్ గా అవకాశం కల్పించి తెలంగాణ ప్రజల అభిమానాన్ని కాపాడుకోవాలన్నారు. వరద ముంపు ప్రాంతాలను శాశ్వత పరిష్కారం, సిమెంటు రోడ్డు కల్పన, పారిశుద్ధ్య నిర్మాణాలు, ఇండ్ల స్థలాల పట్టాలు, డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం వంటి మౌలిక వసతులను త్వరితగతిన పూర్తిచేసి తమ హామీలను నిలబెట్టుకోని వాలని లక్ష్మీపురం, సాకరాశి కుంట, గరీబ్ నగర్, సి ఆర్ నగర్ తదితర 89 మురికివాడల ప్రాంతాల ప్రతినిధి ఈసంబెళ్లి బేబీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కరోనా భృతిని కల్పించాలని మరియు కరొణ వైద్యాన్ని ఆరోగ్యశ్రీలో చేర్చాలని డిమాండ్ చేశారు. పార్టీ తమ లక్ష్యాలైన సాధనకు బడుగు,బలహీన వర్గాలకు చెందిన వారికే మేయర్ అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో మహాదండు మహిళా నాయకురాలు,నాగమణి , సృజన , ప్రభ , సరస్వతి ,బుజ్జి దౌడు స్వప్న ,లత , చింత నిర్మల మడత కిషోర్ , నేరెళ్ల శివకుమార్ , చిమ్మని నవీన్ ,దౌడు రాజు , తదితరులు పాల్గొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement