Friday, April 26, 2024

కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ పేరుతో పేద ప్రజల నడ్డి విరుస్తోంది : ఎమ్మెల్యే అరూరి

హన్మకొండ : దేశంలోని సామాన్య ప్రజల నడ్డి విరిచే విధంగా పాలు, పాల ఉత్పత్తులపై జీఎస్టీ పెంచడాన్ని వ్యతిరేకిస్తూ హన్మకొండలోని ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ లో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డితో కలిసి తెరాస వరంగల్ జిల్లా అధ్యక్షులు, వర్దన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ పేరుతో పేద ప్రజల నడ్డి విరుస్తోంద‌న్నారు. పాలు, పాల ఉత్పత్తులపై కూడా జీఎస్టీ పెంచి సామాన్య ప్రజలపై కేంద్రం పెను భారం మోపుతోంద‌న్నారు. ఇప్పటికే పెట్రోల్, గ్యాస్ ధరలు పెంచిన కేంద్ర ప్రభుత్వం.. దేశంలో పేద, మధ్యతరగతి ప్రజలు బ్రతకలేని పరిస్థితికి తీసుకువచ్చించింద‌న్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పుట్టిన పిల్లల నుండి శ్మశాన వాటికకు వెళ్లే మనిషి వరకు అన్నింటిపై పన్ను విధిస్తోంద‌న్నారు.

చిన్న పిల్లలు తాగే పాలపైన కూడా పన్ను వేసే బీజేపీ ప్రభుత్వ పాలసీని తీవ్రంగా ఖండిస్తున్నామ‌న్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ ఆదాయం పెంచి ప్రజలకు పంచుతుంటే.. బీజేపీ ప్రభుత్వం మాత్రం పేద ప్రజలను దోచుకొని కార్పొరేట్ కంపెనీలకు కొమ్ముకాస్తుంద‌న్నారు. తెలంగాణ రాష్ట్రంపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కక్ష్యపూరీతంగా వ్యవహరిస్తోంద‌న్నారు. తెలంగాణ రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురించేస్తోంద‌న్నారు. బియ్యం కొనడానికి కుంటి సాకులు చూపుతూ మూడు నెలలలుగా ముప్పతిప్పలు పెడుతోందన్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్వాకం వల్ల రాష్ట్రంలోని రైస్ మిల్లుల్లో 93.92లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వలు పేరుకుపోయాయ‌న్నారు. రాష్ట్రంలో ఇటీవల కురిసిన వర్షాలకు దాదాపు 10లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం తడిసిపోయింద‌న్నారు. తడిసిన ధాన్యం నాణ్యత దెబ్బతింటే దాని బాధ్యత కేంద్ర ప్రభుత్వం వహిస్తుందా….? బియ్యం ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నా… కేంద్ర ప్రభుత్వం ఎందుకు తీసుకోవడం లేదు ? కేంద్రం తక్షణమే తెలంగాణ బియ్యాన్ని సేకరించాలని డిమాండ్ చేస్తున్నామ‌న్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement