Thursday, November 7, 2024

భూపాలపల్లి క్రీడల్లో ముందుండాలి.. ఎమ్మెల్యే గండ్ర

భూపాలపల్లి ప్రతినిధి (ప్రభన్యూస్): యువత దురవాట్లకు పోకుండా వ్యాయామం, క్రీడల్లో రాణించి భూపాలపల్లిని ముందు వరుసలో వుంచాలని భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర వెంకట రమణారెడ్డి అన్నారు. బుధవారం భూపాలపల్లి అంబేద్కర్ స్టేడియంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి ఫుడ్ బాల్ టోర్నమెంట్ క్రీడల పోటీలకు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు.

ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ… మారుతున్నకాలంలో సగటు మనిషి వ్యాయామంపై శ్రద్ధ చూపాలని కోరారు. క్రీడల్లో క్రీడాకారులకు గెలుపు ఓటములు సహజమేనని, ఒడినవారు మళ్ళీ గెలుపు దిశగా అడుగువేయాలని కోరారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫుట్ బాల్ క్రీడాకారులను అభినందించి, ఆటను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, క్రీడాకారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement