Wednesday, May 15, 2024

WGL : కేసముద్రం వ్యవసాయ మార్కెట్లో హమాలీల ఆందోళ‌న‌

కేసముద్రం, ఏప్రిల్ 29 (ప్రభన్యూస్): మహబూబాబాద్ జిల్లా కేసముద్రం వ్యవసాయ మార్కెట్ పరిదిలో వ్యాపారులు బయట కొనుగోలు చేస్తున్న ఉత్పత్తులకు కూలీ రేట్లు చెల్లించాలని కోరుతూ హమాలీలు, దడువాయిలు సోమవారం మార్కెట్ కార్యాలయం ముందు ఆందోళన చేప‌ట్టారు. ఈనేపధ్యంలో మార్కెట్ కార్యాలయంలో ప్రత్యేక హోదా కార్యదర్శి అమరలింగేశ్వర్ రావు అధ్యక్షతన ఛాంబర్ ఆఫ్ కామర్స్ అద్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, వ్యాపారులు, దడువాయి సంఘం, హామాలీలు, ట్రెడ్ యూనియన్ నాయకుల సమక్షంలో సమవేశం ఏర్పాటు చేశారు.

- Advertisement -

ఈసందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ.. మార్కెట్ లో వ్యాపారులు కోనుగోలు చెసే దానికంటే బయట మిల్లులు, ట్రేడింగ్ కంపెనీల వద్ధ వేబ్రిడ్జిలో తూకం వేస్తు దడువాయిలకు, హమాలీలకు పని కల్పించకుండా వారి కడుపు కొడుతూ కొనుగోళ్ళు చేస్తున్నారని పేర్కొన్నారు. మార్కెట్ లో కోనుగోలు చేసిన ఉత్పత్తులకు వ్యాపారులు దడువాయిలకు, హమాలీలకు ఇచ్చే కూలీ మాదిరిగానే మిల్లులు, ట్రేడింగ్ కంపెనీల వద్ధ కోనుగోలు చేసిన ఉత్పత్తులకు కూడ డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈక్రమంలో మార్కెట్ అధికారులు, ఛాంబర్ ఆఫ్ కామర్స్, వ్యాపారుల మద్య చర్చలు కొనసాగాయి. మధ్యహ్నం వరకూ కూడా చర్చలు కొనసాగగా ఈ విషయంలో కొలిక్కి రాలేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement