Thursday, May 16, 2024

మరణించిన పోలీసు కుటుంబాలకు పూర్తి సహకారం అందిస్తాం

వరంగల్ – విధినిర్వహణలో ఆకస్మాతుగా మరణించిన పోలీసుల కుటుంబాలకు పూర్తి సహకారం అందిస్తామని వరంగల్ పోలీస్ కమిషనర్ తెలిపారు. అకస్మాత్తుగా మరణించిన పోలీస్ హెడ్ కానిస్టేబుల్ కుటుంబానికి శనివారం వరంగల్ పోలీస్ కమిషనర్ ఆర్థికసాయాన్ని అందజేశారు.వరంగల్ పోలీస్ కమినషనరేట్ ఆర్మూడ్ రిజర్వ్ విభాగంలో హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న గత సంవత్సరం అక్టోబర్ 8వ తేదీన గుండెపోటుతో ఆకస్మాత్తుగా మరణించిన హెడ్ కానిస్టేబుల్ యం. నర్సింగరావు కుటుంబానికి చేయూత పథకంగా పోలీసు కమిషనర్ చేతుల మీదుగా లక్షన్నర రూపాయల ఆర్థికసాయాన్ని అందజేయడంతో పాటు, ఆరోగ్య భద్రత క్రింద మంజూరైన నాలుగు లక్షల రూపాయల చెక్కును పోలీస్ కమిషనర్ మరణించిన హెడ్ కానిస్టేబుల్ సతీమణిరోజారాణి అతని పిల్లలు రాహుల వర్ణన్, అము»మాల్యాదకు అందజేశారు. ఈ సందర్భంగా మరణించిన పోలీస్ హెడ్ కానిస్టేబుల్ కుటుంబానికి ప్రభుత్వం తరుపున అందాల్సి బకాయిలను త్వరితగతిన అందజేసే విధంగా తగు చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు పంజాల అశోక్ కుమార్ సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement