Friday, May 17, 2024

దళితులు ముస్లింలు ఏకమైతే రాజ్యాధికారం సాధ్యం – ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్..

కర్నూల్ బ్యూరో , దళితులు, మైనార్టీలు ఏకమైతే దేశంలో రాజ్యాధికారం సాధించవచ్చని ఎంఐఎం అధినేత, పార్లమెంటు సభ్యులు అసదుద్దీన్ ఓవైసీ అన్నారు, మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా శనివారం కర్నూలు జిల్లా ఆదోనిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ ఎమ్‌ఐఎమ్‌ సభలకు అనుమతులిచ్చేందుకు అధికార పార్టీ నేతలు వివక్ష చూపుతున్నారని ఆరోపించారు. తమ సమావేశాలకు ఆదోనిలో శివారు ప్రాంతాలు కేటాయించడం సరికాదన్నారు. తెదేపా, వైకాపా అధినేతలు ఎన్నికల ప్రచారానికి వస్తే ఇలాగే శివారు కాలనీలను కేటాయిస్తారా? అని ప్రశ్నించారు. తొమ్మిది వార్డుల్లో తమ అభ్యర్థులు నిలబడ్డారని.. పురవాసులు పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ముస్లిం, దళితులు కలిస్తే రాజ్యాధికారం సాధ్యమన్నారు.కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు యూసఫ్‌, సలీం, అజీం, దిలావర్‌ తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు ఆయన పెద్ద మసీదులో ప్రార్థనలు నిర్వహించారు. ముందుగా ఫరిబ్‌ సాహెబ్‌ దర్గాను దర్శించుకుని అక్కడి నుంచి ద్విచక్ర వాహనం నడుపుకొంటూ చిన్న మార్కెట్‌ మీదుగా షాహి జామియా మసీదు(పెద్ద మసీదు)కు చేరుకుని అక్కడ ప్రార్థనలు చేశారు. అనంతరం భోజనం చేసుకుని తిరిగి కర్నూలుకు బయలుదేరి వెళ్లారు. ఈ కార్యక్రమంలో రియాసత్‌ నగర్‌ కార్పొరేటర్‌ మిర్జా సలీంబేగ్‌, సౌదీ రవూఫ్‌, ఉమ్మి యూసుఫ్‌, ఉమ్మి సలీం, దిలావర్‌, నూర్‌ పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement