Friday, April 26, 2024

టీఆర్ ఎస్ సర్కార్ కీలక నిర్ణయం..ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి 4+4 గన్‌మెన్లు..బుల్లెట్ ఫ్రూప్ వాహనం

మునుగోడు ఉప ఎన్నికలు హాట్ హాట్ గా మారాయి. అధికార పార్టీ టీఆర్ ఎస్ తో పాటు బిజెపి కూడా చురుకుగా వ్యవహరిస్తోంది. కాగా టీఆర్ ఎస్ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించేలా ప్రలోభాలకు గురిచేసిన వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. ఈ వ్యవహారంలో రోహిత్‌ రెడ్డి కీలకంగా ఉన్నారు. ఆయన ఇచ్చిన సమాచారంతోనే మొయినాబాద్ ఫాంహౌస్‌పై దాడులు చేసిన పోలీసులు.. నిందితులను రెడ్‌హాండెడ్‌గా పట్టుకున్నారు. తాండూర్‌ ఎమ్మెల్యే ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తుచేస్తున్నారు. దీంతో ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా ప్రభుత్వం ఆయనకు భద్రత పెంచింది. ఎమ్మెల్యే రోహిత్‌ రెడ్డితో నిందితులు జరిపిన ఫోన్‌ ఆడియోలు రెండు విడుదలైన విషయం తెలిసిందే.అధికార పార్టీ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారాన్ని బట్టబయలు చేసిన తాండూరు ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌ రెడ్డి భద్రతను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రోహిత్ రెడ్డికి 4+4 గన్‌మెన్లను కేటాయిస్తూ హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం రోహిత్ రెడ్డికి 2+2 భద్రత ఉండగా.. తాజా పరిణామాల నేపథ్యంలో ఆ సంఖ్యను 4+4కి పెంచింది. దీంతోపాటు ఆయనకు బుల్లెట్ ఫ్రూప్ వాహనాన్ని కూడా కేటాయిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నది.

Advertisement

తాజా వార్తలు

Advertisement