Wednesday, May 8, 2024

TS | వామపక్షాలతో పొత్తులు లేనట్లేనా.. షాక్‌కి గుర‌వుతున్న కామ్రేడ్స్!

తిరుమలగిరి (ప్రభ న్యూస్) : రానున్న సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్ ఎస్‌, వామపక్షాల మ‌ధ్య ఉండ‌దా? ఇంతకుముందు పొత్తు ఉంటుందని మునుగోడు ఉప ఎన్నికలలో సీఎం కేసీఆర్ ప్రకటించిన దానిపై చ‌ర్చ జ‌రుగుతోంది. సిపిఎం, సిపిఐ నాయకులు కలిసి పొత్తులతో పోటీ దిగుదామని ప్రకటించిన సందర్భాలున్నాయి. సోమవారం గులాబీ దళపతి ముఖ్యమంత్రి కేసీఆర్ 115 మంది బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా ప్రకటించడంతో, వామపక్ష నాయకులు షాక్ కు గురయ్యారు.

సీఎం కేసీఆర్ ప్రకటించిన జాబితా ప్రకారం వామపక్షాలతో పొత్తులు లేనట్లే? అని తెలుస్తోంది. ఎమ్ఐఎంతో పొత్తు ఉంటుందని ప్రకటించి వామపక్షాలపై ఊసే ఎత్తలేదని, దీనితో పొత్తు లేదని భావించవలసి వస్తుంది. వామపక్ష నాయకులు ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకుంటారా! లేక కలిసి పోటీ చేస్తారా? వాళ్ల వైఖరి త్వరలో ప్రకటించనున్నట్లు తెలుస్తుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement