Tuesday, May 14, 2024

ఓటీటీలో స్ట్రీమ్​ కానున్న మెగా మూవీ బ్రో.. రిలీజ్ డేట్ ఫిక్స్!

సాయి ధరమ్ తేజ్ ఈ సంవత్సరం విరూపాక్ష, బ్రో సినిమాల విజ‌యాల‌తో మంచి ఫామ్ లో ఉన్నాడు. బ్రో సినిమాలో తన మామ పవన్ కళ్యాణ్‌తో స్క్రీన్‌ను షేర్​ చేసుకున్నాడు. చక్కటి సందేశంతో తెరకెక్కిన ఈ సినిమాకి తెలుగు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. BRO సినిమాలోని ఎమోష‌న్స్ పవన్ కళ్యాణ్ కామిక్ టైమింగ్ తో పాటు అనేక ఇతర అంశాలతో ప్రేక్ష‌కుల‌ను బాగా ఆక‌ట్టుకుని మంచి సక్సెస్ సాధించింది.

ఇక ఇప్పుడు ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. BRO మూవీ డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ‌ నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేసింది. ఆగస్ట్ 25 నుండి BRO మూవీ ప్లాట్‌ఫారమ్‌లో ప్రసారం కానుంది. ఈ వీకెండ్ ప్రేక్షకులకు ఇదో మంచి అనుభూతిని కలిగిస్తుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement