Tuesday, July 23, 2024

Bollywood : అక్ష‌య్ స‌ర‌స‌న కీర్తీ సురేష్

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న హీరోయిన్లు చాలా మంది బాలీవుడ్ లో కూడా ఆఫర్స్ ను అందుకుంటున్నారు… కొందరు అక్కడ నిలుపుకోవాలని ట్రై చేస్తుంటే మరికొందరు మాత్రం వరుస ఆఫర్స్ ను అందుకుంటూ బిజీగా ఉన్నారు. అందులో రష్మిక మందన్న తగ్గేదేలే అంటుంది.. ఇప్పుడు కీర్తి సురేష్ కూడా ఆ లిస్టులోకి చేరింది.. బాలీవుడ్ లో మరో ఆఫర్ ను పట్టేసింది.

- Advertisement -

ఎప్పుడు పద్దతిగా కనిపించే కీర్తి సురేష్ ఈ మధ్య గ్లామర్ డోస్ పెంచేసింది.. ప్రస్తుతం ఈ చిన్నది తెలుగు, తమిళ్ తో పటు బాలీవుడ్ లోనూ నటిస్తుంది. బాలీవుడ్ లో కీర్తిసురేష్ ప్రస్తుతం వరుణ్ ధావన్ తో కలిసి బేబీ లో నటిస్తుంది. ఈ షూటింగ్ త్వరలోనే ప్రారంభంకానుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు మరో ఆఫర్ అందుకున్నట్లు తెలుస్తుంది.. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ సినిమాలో ఛాన్స్ కొట్టేసినట్లు టాక్ వినిపిస్తుంది.

ఇందులో నిజమేంత ఉందో తెలియదు కానీ ఈ వార్త నిజమైతే కీర్తిసురేష్ క్రేజ్ బాలీవుడ్ లో పెరగడం ఖాయం. ప్రియదర్శన్ అక్షయ్ కుమార్ తో ఓ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ హారర్ కామెడీ నేపథ్యంలో ఉంటుందని తెలుస్తోంది. ఈ మూవీలో హీరోయిన్ గా అలియా భట్, కియారా అద్వానీ పేర్లు కూడా వినిపిస్తున్నాయి.. వాళ్ళతో పాటు కీర్తి సురేష్ కూడా ఉందనే వార్త చక్కర్లు కొడుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement