Tuesday, June 4, 2024

Delhi : తీహార్ జైలుకు బాంబు బెదిరింపు..

ఢిల్లీలో తీహార్ జైలుకు బాంబు బెదిరింపు ఈమెయిల్స్ కలవరపెడుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి బాంబు బెదిరింపు తీవ్ర కలకలం రేపుతోంది. తీహార్ జైలుకు బాంబు బెదిరింపు వచ్చింది. ఈమెయిల్ ద్వారా తీహారు జైలుకు బాంబు బెదిరింపు వచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి తనిఖీలు చేపట్టారు.

ఇవాళ‌ సాయంత్రం తీహార్ జైలుకు బాంబు బెదిరింపు కాల్ వచ్చినట్లు జైలు అధికారులు తెలిపారు. దీంతో వారు ఢిల్లీ పోలీసులకు సమాచారం అందించారు. కాల్ తో పాటు జైలుకు మెయిల్ కూడా వచ్చినట్లు పోలీసులు నిర్థారించారు. అయితే జైలులో అనుమానాస్పదంగా ఎలాంటి వస్తువ గుర్తించలేదని జైలు అధికారులు తెలిపారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు తీహార్ జైలులో విస్తృత తనిఖీలు చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement