Friday, April 26, 2024

తెలుగు వర్సిటీ ప్రవేశ పరీక్షలు.. ద‌రఖాస్తు చేసుకోండి ఇలా..

హైదరాబాద్‌, ( ప్రభ న్యూస్): హైదరాబాద్‌ నాంపల్లిలో ఉన్న తెలుగు విశ్వవిద్యాలయం 2021-22 విద్యాసంవత్సరానికి వివిధ కోర్సులకు ప్రవేశ పరీక్షలను ఈనెల 17న నిర్వహించనున్నట్టు వర్సిటీ అడ్మిషన్‌ కమిటీ సంచాలకులు కోట్ల హనుమంతరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే వివిధ కోర్సులకు ఆసక్తి గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరించామని పేర్కొన్నారు.

బీఎఫ్‌ఏ, ఎంఏ (తెలుగు, హిస్టరీ, జ్యోతిష్యం, జర్నలిజం, కల్చర్‌ అండ్‌ టూరిజం ) కోర్సులకు యూనివర్సిటీ ప్రాంగణంలోనే ప్రవేశ పరీక్షలను నిర్వహిస్తామని తెలిపారు. దరఖాస్తు చేసిన అభ్యర్థులు ఈ నెల 12వ తేదీ నుంచి వెబ్‌సైట్ల ద్వారా హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సూచించారు.
http://www.teluguuniversity.ac.in

http://www.pstucet.org

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. రియల్ టైమ్ న్యూస్ అప్ డేట్స్ కోసం.. ప్రభన్యూస్ ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి
https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement