Wednesday, May 22, 2024

టీపీటీయూ డైరీ, క్యాలెండ‌ర్ ఆవిష్క‌రించిన స‌బితా ఇంద్రారెడ్డి

తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచ‌ర్స్ యూనియ‌న్ (టీపీటీయూ) నూత‌న డైరీ, క్యాలెండ‌ర్ల‌ను విద్యాశాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి ఈరోజు హైద‌రాబాద్ లో ఆవిష్క‌రించారు. ఈసంద‌ర్భంగా జీఓ 317 ఆధారంగా ప్ర‌స్తుతం జ‌రుగుతున్న ఉపాధ్యాయుల కేటాయింపుల్లో స్పౌజ్ కేసుల‌ను త్వ‌ర‌గా ప‌రిష్క‌రించాల‌ని, జిల్లాలు మారిన జూనియ‌ర్ ఉపాధ్యాయుల‌కు ప‌ర‌స్ప‌ర అంగీకారంతో బ‌దిలీ కోరుకునే అవ‌కాశం క‌ల్పించాల‌ని టీపీటీయూ చేసిన విజ్ఞ‌ప్తికి మంత్రి సానుకూలంగా స్పందించారు. ఈ కార్య‌క్ర‌మంలో రాష్ట్ర అధ్య‌క్షులు మ‌ట్ట‌ప‌ల్లి రాధాకృష్ణ‌, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప‌ట్లోళ్ల చంద్ర‌శేఖ‌ర్, వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షులు జి.వేణుగోపాల‌స్వామి, సూర్యాపేట జిల్లా అధ్య‌క్షులు భూప‌తి శ్రీనివాస్ , నాయ‌కులు జి.మోహ‌న్ రెడ్డి, సంగారెడ్డి జిల్లా అధ్య‌క్షులు ఎన్‌.శ్రీధ‌ర్ రావు, న‌ల్ల‌గొండ‌, సిద్దిపేట‌, యాదాద్రి భువ‌న‌గిరి, మెద‌క్, రంగారెడ్డి, హైద‌రాబాద్ జిల్లాల అధ్య‌క్షులు ఐ.నాగ‌య్య‌, బి.వెంక‌టేశం, జి.మాధ‌వ‌రెడ్డి, నాగేశ్వ‌ర‌రావు, అశ్వ‌ద్ధామ‌, భిక్ష‌ప‌తి, త‌దిత‌రులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement