Saturday, April 27, 2024

పకడ్బందీగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు.. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్​రాజ్​

మేడ్చల్, (ప్రభ న్యూస్ ప్రతినిధి) : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను ( హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్​నగర్​ ఉమ్మడి జిల్లాలో) పకడ్భందీగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని, రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ అన్నారు. శుక్రవారం ఆయన మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లాలోని కీసర ఆర్డీవో కార్యాలయంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఓటరు జాబితా నమోదు ప్రక్రియ విచారణ జరుగుతున్న తీరుతో పాటు ఇప్పటి వరకు ఎన్ని అప్లికేషన్లు వచ్చాయనే వివరాలను కలెక్టర్ ను అడిగి తెలుసుకొన్నారు. రాష్ట్రంలోని 33 జిల్లాల్లోనే మొట్టమొదటిసారిగా మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లాకు వచ్చిన వికాష్ రాజ్ కు జిల్లా కలెక్టర్ హరీశ్, అధికారులు ఘనంగా స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ మాట్లాడుతూ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందని, ఈ మేరకు ప్రస్తుతం ఓటరు జాబితా నమోదు ప్రక్రియకు సంబంధించి జరుగుతున్న తీరును ఆయన పరిశీలించేందుకు ఇక్కడికి వచ్చినట్టు తెలిపారు. ఇప్పటి వరకు ఎన్ని అప్లికేషన్లు వచ్చాయనే వివరాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకొన్నారు. ఈనెల 19న విచారణ డ్రాఫ్టులు, 23 తేదీ వరకు ఓటర్ల తుదిజాబితా విడుదల చేస్తామని, అనంతరం డిసెంబర్ 9వ తేదీన ఓటర్ల జాబితాలో ఏమైనా అభ్యంతరాలు, మార్పులు, చేర్పులు ఉంటే క్లయిమ్ చేసుకొనేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement