Tuesday, May 14, 2024

వడ్ల కొనుగోలుపై పాలిటిక్స్ వద్దు: టీడీపీ నేత హరీష్

జనగామ, ప్రభా న్యూస్: రైతులు పండించిన వరి ధాన్యం కొనుగోలుపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయ డ్రామాలు చేస్తూ రైతులను మోసం చేస్తున్నారని టిడిపి తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామిని హరీష్ అన్నారు. శనివారం జనగామ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ చౌరస్తా వద్ద జనగామ పట్టణ టిడిపి పార్టీ పట్టణ అధ్యక్షులు కొత్తపల్లి సమ్మయ్య ఆధ్వర్యంలో రైతులు పండించిన వరి ధాన్యాన్ని ప్రభుత్వాలు కొనుగోలు చేయాలని రైతుల పక్షాన డిమాండ్ చేస్తూ ఒక్క రోజు దీక్ష చేపట్టడం జరిగింది. ఈ దీక్షకు ముఖ్య అతిథులుగా తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామిని హరీష్, రాష్ట్ర B C సెల్ కార్యదర్శి బైరు బాబు, లు హాజ‌ర్యారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తెలంగాణ రైతంగాన్ని మోసం చేస్తూ వారీ బాధ్యతలను విస్మరిస్తూ రైతులు పండించినటు వంటి వరి దాన్యన్ని కొనుగోలు చేయకుండా రైతులను అయ్యోమయనికి గురిచేస్తూ రైతు కుటుంబాలను వీదిపాలు చేస్తు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయ డ్రామాలకు తెర తీస్తున్నారని ధ్వజ మెత్తారు అన్నారు. రైతు ప్రభుత్వం అని చెప్పుకునే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వలు తెలంగాణ రైతులను దగా చేస్తున్నారని పేర్కొన్నారు రైతు పండించే ప్రతి దాన్యం గింజను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మద్దతు ధరతో కొనుగోలు చేయాలి అదేవిధంగా రైతుకు తానకు నచ్చినటువంటి పంట వేసుకునే పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలన్నారు బిజెపి టిఆర్ఎస్ ప్రభుత్వాలు ఢిల్లీలో దోస్తీ చేస్తూ రాష్ట్రంలో కుస్తీ పడుతు రైతు నెత్తిన శఠగోపం పెట్టే అందుకే ధర్నాల ప్రయత్నమని ఎద్దేవా చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. రియల్ టైమ్ న్యూస్ అప్ డేట్స్ కోసం.. ప్రభన్యూస్ ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి
https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement