Sunday, April 28, 2024

క‌త్రినా..విక్కీల పెళ్ళి విశేషాలు..

ఎట్ట‌కేల‌కు పెళ్ళిపీట‌లెక్క‌నున్నారు బాలీవుడ్ న‌టులు కత్రినా కైఫ్.. విక్కీ కౌశల్.. డిసెంబర్ 7 లేదా 8 న రాజస్థాన్‌లోని ఒక కోటలో వివాహం చేసుకోబోతున్నారట‌. పెళ్లి సన్నాహకాల కోసం కత్రినా, విక్కీల బృందం రాజస్థాన్ చేరుకున్నట్లు సమాచారం. రిపోర్ట్ ప్రకారం, కత్రినా పెళ్లి లీక్‌తో కలత చెందిందని, బహుశా అందుకే ఎవరికీ ఇంకా ఆహ్వానం పంపలేదట‌. అయితే, ఈ ఇద్దరు తారలు తమ స్నేహితులు .. సన్నిహితులను డిసెంబర్ 7-9 వరకు పూర్తిగా డేట్స్ ఫ్రీ చేసుకోవాలని కోరారు.ఈ జాబితాలో కరణ్ జోహార్, అలీ అబ్బాస్ జాఫర్, రోహిత్ శెట్టి, మినీ మాథుర్ .. కబీర్ ఖాన్, వరుణ్ ధావన్ .. నటాషా దలాల్ .. సిద్ధార్థ్ మల్హోత్రా-కియారా అద్వానీ ఉన్నారని టాక్.ఇక కత్రినా-విక్కీల వివాహానికి స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కూడా హాజరవుతారని కొన్ని రోజుల క్రితం వార్తలు వచ్చాయి. ఈ కారణంగా, ఆయన తన ‘ఏక్ థా టైగర్’ సినిమా షూటింగ్‌ను కూడా జనవరి 2022 వరకు వాయిదా వేసుకున్నాడ‌ని స‌మాచారం. ఈ మేర‌కు రోకా వేడుక‌లు కూడా అక్క‌డే జ‌ర‌గ‌నున్నాయ‌ని టాక్ వినిపిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement