Friday, April 26, 2024

Nizamabad : చేపల ఆహార మేళాని ప్రారంభించిన.. కలెక్టర్

కామారెడ్డి, (ప్రభ న్యూస్) : చేపలు ఆరోగ్యానికి వరమ‌ని జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని నాన్ వెజ్, వెజ్ మార్కెట్ లో చేపల ఆహారమేళాను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం చేపల ఆహార పండగను నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. ప్రభుత్వం మత్స్యకారులకు 100% రాయితీపై చేప విత్తనాలను ఇస్తుందని తెలిపారు. మత్స్యకారులకు మోపెడ్లు, ఐస్ బాక్సులు ఇవ్వడం వల్ల చేపలను ఇతర ప్రాంతాలలో విక్రయించుకొనే వెసులుబాటు కలిగిందని చెప్పారు. మత్స్యకారుల సంక్షేమం కోసం ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ నిట్టు జాహ్నవి, జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ దోత్రే, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ, జిల్లా మత్స్య శాఖ అధికారి వరదారెడ్డి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement