Sunday, February 25, 2024

ప్రభుత్వ అవినీతి అక్రమాలను ఎండగట్టండి : బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి

నిర్మల్ రూరల్, జూన్ 8 (ప్రభ న్యూస్) : నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ నేతలు ప్రజాప్రతిని చేస్తున్న అవినీతి అక్రమాలను ఎక్కడికి అక్కడ ఎండకట్టాలని బీజేపీ నేత మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం ఆయన నివాస గృహంలో లక్ష్మణ్ చందా మండల బీజేపీ నాయకులు కార్యకర్తలు ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రానున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త సైనికునిలా పనిచేసి గెలుపే లక్ష్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న ఆగడాలను ప్రజాక్షేత్రంలో ఎప్పటికప్పుడు ఎండగడుతూ ప్రజలకు చేరువ అయ్యేందుకు ప్రయత్నించాలని సూచించారు. స్థానికంగా జరుగుతున్న అవినీతి అక్రమాలను ఎండగట్టాలన్నారు. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను గడపగడపకు చేరవేయాలని కార్యకర్తలకు సూచించారు. సమావేశంలో బీజేపీ నేతలు అయ్యన్న గారి భూమయ్య, రావుల రామ్నాథ్, చందు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement